సింగిల్‌గా పోటీ చేస్తే జనసేనకు 70 సీట్లు వచ్చేవి.. కానీ: నాగబాబు కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

2024 ఎన్నికల్లో జనసేన పార్టీ విడిగా పోటీ చేసి ఉంటే 70 సీట్లు వచ్చేవని స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు వెల్లడించారు. ఏపీ ప్రజల శ్రేయస్సు కోసం పవన్ కల్యాణ్ 50 సీట్లు వదులుకున్నారని ఆయన స్పష్టం చేశారు

సింగిల్‌గా పోటీ చేస్తే జనసేనకు 70 సీట్లు వచ్చేవి.. కానీ: నాగబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ(Janasena) 21 సీట్లు సాధించిన విషయం తెలిసిందే. అయితే జనసేన విడిగా పోటీ చేసి ఉంటే 70 సీట్లు వచ్చేవట. ఈ విషయాన్ని స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు(Mlc Nagababu) వెల్లడించారు. ఏపీ ప్రజల శ్రేయస్సు కోసం పవన్ కల్యాణ్(Pawan Kalyan) 50 సీట్లు వదులుకున్నారని ఆయన స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో పవన్ రిస్క్ తీసుకోలేదని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party) మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ఏపీ వాసులు(Ap People) వలస వెళ్లే పరిస్థితి ఉండేదని ఎమ్మెల్సీ నాగబాబు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

Next Story