తిరుమల లడ్డూలో కెమికల్స్.. ఎమ్మెల్సీ నాగబాబు హాట్ కామెంట్స్

by Vemula.Srinu Prasad |

తిరుమల లడ్డూలో కెమికల్స్ కలిపిన దుర్మార్గపు పార్టీ వైసీపీ అని ఎమ్మెల్సీ నాగబాబు మండిపడ్డారు. వైసీపీ నాయకులపై శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవం సభలో ఆయన హాట్ కామెంట్స్ చేశారు

తిరుమల లడ్డూలో కెమికల్స్.. ఎమ్మెల్సీ నాగబాబు హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ(Tirumala Laddu)లో కెమికల్స్ కలిపిన దుర్మార్గపు పార్టీ వైసీపీ(Ycp) అని ఎమ్మెల్సీ నాగబాబు మండిపడ్డారు. వైసీపీ నాయకులపై శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవం(Jana Sena Formation Day) సభలో ఆయన హాట్ కామెంట్స్ చేశారు. జనసేన(Janasena), టీడీపీ(Tdp), బీజేపీ(Bjp) కలిసి ఉన్నంతకాలం వైసీపీ అధికారంలోకి రాదని తెలిపారు. రప్పా రప్పా అనే రాజకీయ భాష మాట్లాడే నీచమైన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని వ్యాఖ్యానించారు. ఏ ప్రభుత్వమైనా మతాన్ని నాశనం చేసే పని చేయదని, కానీ వైసీపీ మాత్రం హిందూమాతాన్ని నాశనం చేయాలని చూస్తోందని నాగబాబు మండిపడ్డారు. వైసీపీని ఎప్పటికీ అధికారంలోకి రాకుండా చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని సింగిల్ డిజిట్‌కే పరిమితం చేయాలని చెప్పారు.

వైసీపీకి నా సలహా...

‘‘జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీ నాయకులకు నా సలహా. పన్నెండేళ్లలో ఎన్నో ఎత్తు పల్లాలు చూసాం, మీ బెదిరింపులు ఎంత..?. ప్రజా క్షేమం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కల్యాణ్ ఎన్నో త్యాగాలు చేశారు. ఫలితంగా ఈ రోజు గ్రామీణ ప్రాంతాలు నాణ్యమైన రోడ్లతో కళకళలాడుతున్నాయి. అనకాపల్లి సీటు వదులుకున్న కారణంగానే పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపు కోసం పని చేయగలిగాననే సంతృప్తి నాకు ఉంది.’’ అని నాగబాబు వ్యాఖ్యానించారు.

Next Story