- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైసీపీ ఎమ్మెల్సీ సుబ్రమణ్యం కిడ్నాప్ కలకలం!
తిరుపతిలో వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కిడ్నాప్ అయ్యారంటూ వదంతులు వ్యాపించాయి.

దిశ డైనమిక్ బ్యూరో: తిరుపతిలో వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కిడ్నాప్ అయ్యారంటూ వదంతులు వ్యాపించాయి.అయితే తాను ఆసుపత్రిలో చేరాను అంటూ ఆయన కొద్దిసేపు కిందట వీడియోను విడుదల చేశారు. తన ఎవరు కిడ్నాప్ చేయలేదని అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరానని ఆ వీడియోలో పేర్కొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో కలకలం రేగింది. ఉద్రిక్త పరిస్థితుల మధ్య నిన్న వాయిదా పడిన ఎన్నిక ఈరోజు జరగాల్సి ఉంది. దీంతో తిరుపతిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సుబ్రహ్మణ్యం కోఆప్షన్ సభ్యుడిగా ఉన్నారు. నిన్న కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. నిన్న కూడా నలుగురు కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారంటే వైసీపీ ఆరోపించింది. దీనిని టీడీపీ కొట్టి పారేసింది. ఆ నలుగురు కార్పొరేటర్లు కూడా తమను ఎవరు కిడ్నాప్ చేయలేదంటూ వీడియోలు విడుదల చేశారు. అయితే వైసీపీ మాత్రం మరో విధంగా వాదిస్తోంది. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటు వేయకుండా చేసేందుకు సిపాయిని టీడీపీ నేత, శాప్ ఛైర్మన్ రవి నాయుడు కిడ్నాప్ చేశారని పేర్కొంది. 45వ డివిజన్ కార్పొరేటర్ అనీష్ భార్య డాక్టర్ మమతను కూడా కిడ్నాప్ చేసేందుకు విఫలయత్నం చేశారని ఆరోపించింది. తిరుపతి వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి బంధువు కౌశిక్ రెడ్డి, టౌన్ బ్యాంకు వైస్ చైర్మన్ వాసుదేవ యాదవ్‌లపై కూడా దాడులు చేశారని అయితే పోలీసులు కనీసం తమ కంప్లైంట్ కూడా తీసుకోవడం లేదని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు డిప్యూటీ మేయర్ ఎన్నిక కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్వీయూ పరిసర ప్రాంతాల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్నటి ఘటనల నేపథ్యంలో అక్కడ 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. ఈ ఉదయం 11గంటలకు డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రారంభం కానుంది.






