- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో పరిపూర్ణత
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో పరిపూర్ణత చేకూరుతుందని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు

దిశ, నిడదవోలు : ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో పరిపూర్ణత చేకూరుతుందని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. నిడదవోలు పరిధిలోని కానూరు వైనాట్ ఫంక్షన్ హాల్ లో ఇవాళ జిల్లా ఇన్ చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి దుర్గేశ్ కూటమి శ్రేణులను ఎమ్మెల్సీ ఎన్నికలకు సమాయత్తం చేశారు. ఈ సందర్భంగా దుర్గేశ్ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఓటర్లుగా నమోదైన యువత నూరు శాతం కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు ఓటు వేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఇంకా ఎవరైనా గ్రాడ్యుయేట్లు మిగిలిపోయి ఉంటే ఓటరుగా నమోదు చేయించాలన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి విజయ దుందుభి మోగించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేదని, వారు తమ అభ్యర్థిని పోటీలో నిలబెట్టే సాహసం చేయబోరని మంత్రి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఈ అభివృద్ధిని కొనసాగించాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించాలని యువతకి పిలుపునిచ్చారు. అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారని, ఏపీలో మాత్రం త్రిబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, మాజీ ఉపసభాపతి బూరుగడ్డ వేదవ్యాస్, మాజీ మంత్రి కేఎస్ జవహర్, బీజేపీ రాజమండ్రి అధ్యక్షుడు టి.నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.






