- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాళ్లిద్దరు మోసం చేస్తున్నారు: ఎమ్మెల్సీ బొత్స సంచలన ఆరోపణలు
వాళ్లిద్దరు మోసం చేస్తున్నారని ఎమ్మెల్సీ బొత్స సంచలన ఆరోపణలు ఆరోపణలు చేశారు..

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రజలను సీఎం చంద్రబాబు(Cm Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy Cm Pawan Kalyan) మోసం చేస్తున్నారంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District)లో పర్యటించిన ఆయన.. వైసీపీ నేతలను ఉద్దేశించి చంద్రబాబు, పవన్ చేసిన హెచ్చరికలపై స్పందించారు. తాట తీస్తామని, తోలు తీస్తామని, మక్కెలు ఇరగగొడతామంటే ఇక్కడ ఎవరూ ఖాళీగా లేరని, చేతకాని వాళ్లం కూడా కాదని, తమకేం రాదని అనుకోవద్దన్నారు. ప్రజాస్వామ్యాన్ని నమ్మేవాళ్లమని, చట్టంపై గౌరవం ఉందని, అందుకే ఆగుతున్నామని చెప్పారు. కానీ చట్టాలతో మోసం చేయాలనే చూస్తే తిరగబడతామని బొత్స హెచ్చరించారు.
Next Story






