- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెడికల్ కాలేజీలపై బొత్స కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కాబోయే మెడికల్ కాలేజీలు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగాలని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కాబోయే మెడికల్ కాలేజీలు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగాలని, ప్రైవేటుకు అప్పగించొద్దని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(Mlc Bosta Satyanarayana) అన్నారు. మెడికల్ కాలేజీల(Medical Colleges) వ్యవహారంపై వైసీపీ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ పేద విద్యార్థులకు మేలు చేయాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్(Ys Jagan) మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా ప్రజలు సంతకాల సేకరణలో పాల్గొంటున్నారని గుర్తు చేశారు. అవసరం మేరకు చికిత్స అందించేందుకు కోవిడ్ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డామని తెలిపారు. జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని జగన్ హయాంలో ముందుకెళ్లామని చెప్పారు. పేదల ఆరోగ్యం కోసం జగన్ భారీగా నిధులు కేటాయించారన్నారు. తమ హయాంలో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యాయని తెలిపారు. జగన్‌కు మంచి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగిస్తున్నారని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.






