- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెప్పులు వేసుకుని అసెంబ్లీలో దేవుడి ఫొటో పట్టుకోలేదు: ఎమ్మెల్సీ బొత్స
చెప్పులు వేసుకుని శాసనమండలిలో దేవుడి ఫొటో పట్టుకోలేదని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తెలిపారు. ఫొటోలను ఎలా మార్ఫింగ్ చేశారో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు....

దిశ, వెబ్ డెస్క్: చెప్పులు వేసుకుని శాసనమండలిలో దేవుడి ఫొటో పట్టుకోలేదని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(MLC Botsa Satyanarayana) తెలిపారు. ఫొటోలను ఎలా మార్ఫింగ్ చేశారో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. త్వరలోనే ఒరిజినల్ వీడియోలను ప్రజల ముందుకు తీసుకొస్తామన్నారు. ఇందాపూర్ నెయ్యి బయట కిలో రూ. 560కి అమ్ముతూ టీటీడీ(TTD)కి రూ. 658 ఎలా సరఫరా చేస్తోందని చెప్పారు. సీబీఐ(CBI)పై నమ్మకం లేక ఏకసభ్య కమిషన్(Single Member Commission) వేశారని, కోర్టులపై తమకు నమ్మకం ఉందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తెలిపారు. కల్తీ పాల ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని బొత్స విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయిందని, కల్తీ పాల ఘటనకే అదే కారణమని ఆయన హెచ్చరించారు. పంటలకు, గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందిపెడుతున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీ పేరుతో విశాఖ(Visakha)లో భూములు కొట్టేస్తున్నారని బొత్స ఆరోపించారు.






