టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు.. ప్రత్యేక దర్యాప్తుకు ఎమ్మెల్సీ డిమాండ్

by Naga Rani Yarlagadda |

జగన్ హయాంలో తిరుపతి నగరపాలక సంస్థలో జరిగిన టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు.. ప్రత్యేక దర్యాప్తుకు ఎమ్మెల్సీ డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: జగన్ హయాంలో తిరుపతి నగరపాలక సంస్థలో జరిగిన టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కుంభకోణాల్లో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రేంటో విచారణలో తేల్చాలని కోరుతూ సీఎంకు లేఖ రాశారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణాలపై.. భూమన తన తప్పేమీ లేదని సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. గత వైసీపీ హయాంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి చేసిన ఆరోపణల ఆధారంగా దీనిపై దర్యాప్తు చేయించాలన్నారు. కాగా.. జగన్ హయాంలో రాష్ట్రంలో అనేక టీడీఆర్ కుంభకోణాలు జరిగాయని ఆరోపించిన ఆయన.. తిరుపతిలో జరిగిన కుంభకోణానికి సీనియర్ అధికారిణే కారణమని భూమన ఆరోపించిన విషయాన్ని భూమిరెడ్డి గుర్తు చేశారు.

Next Story