- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగన్ కు సవాల్ విసిరిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి
టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి వైసీపీ అధినేత జగన్‌కు మరో సెన్సేషనల్ సవాల్ విసిరారు.

దిశ, వెబ్ డెస్క్ : టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి వైసీపీ అధినేత జగన్‌కు మరో సెన్సేషనల్ సవాల్ విసిరారు. జగన్ అధికారంలో ఉన్న 2019-24 మధ్య అరటి పంటకు ఒక్క రూపాయి అయినా పంట బీమా చెల్లించినట్లు జగన్ నిరూపిస్తే నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేసారు. అలా నిరూపించకపోతే జగన్ రాజీనామా చేయాలని భూమిరెడ్డి డిమాండ్ చేసారు. జగన్ అరాచకాల వల్లే పులివెందులలో బనానా ప్రాసెసింగ్ యూనిట్ మనుగడలోకి రాలేదని ఆరోపించారు.
జగన్ పులివెందుల రైతుల వెన్ను విరిచారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ కాలంలో రాయలసీమకు ఒక్క ఎకరాకు అదనంగా నీటిని ఇచ్చినట్లు చూపగలరా అని నిలదీశారు. రైతు ఆత్మహత్యలు ఎక్కువగా ఎందుకు జరిగాయో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అరటి ధరలు పడిపోవడానికి ఉత్తరాది నుంచి దిగుబడి ఎక్కువ రావడం, పంట విస్తీర్ణం పెరగడమే కారణమని, త్వరలోనే రైతుల సమస్య పరిష్కారమవుతుందని భరోసా ఇచ్చారు. జగన్ అసెంబ్లీకి వస్తే అన్ని వాస్తవాలూ బయటపడతాయని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.






