- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యే ఆకస్మిక పరిశీలన.. చెత్త తొలగింపు ఏజెన్సీ ప్రతినిధులకు స్ట్రాంగ్ వార్నింగ్
గుడివాడ పురపాలక సంఘ పరిధిలోని డంపింగ్ యార్డ్‌ను అధికారులతో కలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పరిశీలించారు. డంపింగ్ యార్డ్‌లో జరుగుతున్న చెత్త ప్రాసెసింగ్ తొలగింపు ప్రక్రియను పరిశీలించారు. ..

దిశ, వెబ్ డెస్క్: గుడివాడ(Gudiwada) పురపాలక సంఘ పరిధిలోని డంపింగ్ యార్డ్(Dumping Yard)ను అధికారులతో కలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము(Mla Venigandla Ramu) పరిశీలించారు. డంపింగ్ యార్డ్‌లో జరుగుతున్న చెత్త ప్రాసెసింగ్(Garbage processing), తొలగింపు ప్రక్రియ( Removal process)ను పరిశీలించారు. ఇప్పటివరకు 42 వేల టన్నుల చెత్తను ప్రాసెస్ చేసి తొలగించినట్లు తెలుసుకున్నారు. అయితే చెత్త తొలగింపు పనులు మందకొడిగా సాగడంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్షాకాలం ప్రారంభమైతే చెత్త తొలగింపు మరింత కష్టమవుతుందని, నిర్ణీత గడువులోపు పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఏజెన్సీ ప్రతినిధులను ఎమ్మెల్యే ఆదేశించారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా..
అనంతరం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే డంపింగ్ యార్డ్‌లో భారీగా చెత్త పేరుకుపోయిందని విమర్శించారు. రోజుకు 1200 టన్నుల చెత్తను ప్రాసెస్ చేసి తొలగించే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. యార్డుకు ఆనుకుని ఉన్న పొలాలకు సమాంతరంగా స్థలాన్ని పూర్తిగా శుభ్రపరిచేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మొత్తం 1 లక్ష 20 వేల టన్నుల చెత్త తొలగింపునకు ప్రణాళిక రూపొందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటికే 46 వేల టన్నుల చెత్త ప్రాసెసింగ్ పూర్తి అయిందని, మరో 40 వేల టన్నుల చెత్త ప్రాసెసింగ్ దశలో ఉందని చెప్పారు. వర్షాలు ప్రారంభమయ్యేలోపు వీలైనంత ఎక్కువ చెత్తను తొలగించేలా చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు.






