- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇకపై జాగ్రత్తగా ఉంటా: అధిష్టానానికి ఎమ్మెల్యే థామస్ వివరణ
తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జీడి నెల్లూరు శాసనసభ్యుడు థామస్ అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. తన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో పార్టీ అధిష్టానం పిలుపు మేరకు అక్కడి వెళ్లిన ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిసి సుదీర్ఘంగా చర్చించారు. ...

దిశ, వెబ్ డెస్క్: తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్(Nellore MLA Thomas) అమరావతిలోని తెలుగుదేశం పార్టీ(Tdp) కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. తన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో పార్టీ అధిష్టానం పిలుపు మేరకు అక్కడి వెళ్లిన ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు(Palla Srinivasa Rao)ను కలిసి సుదీర్ఘంగా చర్చించారు. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, తాను మాట్లాడిన మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని పల్లాకు థామస్ వివరించారు. తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. కొన్ని వర్గాలు తన మాటలను పూర్తిగా వక్రీకరించాయని చెప్పారు. తప్పుడు కోణంలో ప్రచారం చేయడం వల్లే ఈ వివాదం ఇంత పెద్దదైందని పల్లా శ్రీనివాసరావు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే ఆలోచన తనకు ఎంతమాత్రం లేదని చెప్పారు.
ఇకపై జాగ్రత్తగా ఉంటా
భవిష్యత్తులో ఇటువంటి వివాదాలకు తావివ్వకుండా మరింత అప్రమత్తంగా ఉంటానని, ప్రజాప్రతినిధిగా మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటానని ఎమ్మెల్యే థామస్ హామీ ఇచ్చారు. తాను ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తగానే ఉంటానని, పార్టీ నాయకత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి పనిచేస్తానని స్పష్టం చేశారు.






