- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైయస్ జగన్ పై ఎమ్మెల్యే సోమిరెడ్డి విమర్శనాస్త్రాలు
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan) సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (MLA Somireddy) ఎక్స్ వేదికగా విమర్శనాస్త్రాలను సంధించారు.

దిశ, వెబ్ డెస్క్ : మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan) సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (MLA Somireddy) ఎక్స్ వేదికగా విమర్శనాస్త్రాలను సంధించారు. పరాకమణి చోరీ కేసు విషయంలో వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. పరకామణి చోరీ కేసు విషయంలో జగన్ అహంకారంతో మాట్లాడారని ఆరోపించారు. అటువంటి వ్యాఖ్యలు చేసిన ఆయన్ను హిందూ సమాజం ఎన్నటికీ క్షమించదన్నారు. హుండీ చోరీ చేస్తే తప్పేంటి అంటావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన శ్రీవారి హుండిలో చెయ్యి పెట్టినా తప్పు లేదన్నట్టుగా మాట్లాడడం పట్ల ఎమ్మెల్యే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శ్రీవారి భక్తులు మొక్కులను చెల్లించుకోవడానికి స్వామివారికి నిలువుదోపిడీ చేస్తారన్నారు. కానీ వైయస్ జగన్ ప్రభుత్వం ఏకంగా శ్రీవారిని దోపిడీ చేసే రకమని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో చేసిన పాపాలే ఆ పార్టీని 11 ఎమ్మెల్యే స్థానాలకు పరిమితం చేసిందన్నారు.
అయినా కూడా వైయస్ జగన్ లో అహంకారం ఏ మాత్రం తగ్గలేదని అసహనాన్ని వ్యక్తపరిచారు. శ్రీవారి హుండీ నుంచి ఒక్క రూపాయి కూడా తీసినా పాపమేనని స్పష్టం చేశారు. అలాంటి ఏకంగా పరకామణిలో చోరీ జరిగిన చోరీని.. ఏదో చిన్ని చోరీ అని జగన్ కొట్టిపారేయడాన్ని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తప్పుబట్టారు. అసలు ఎంత ధైర్యం ఉంటే అలాంటి వ్యాఖ్యలు చేస్తారని అన్నారు. వైయస్ జగన్ ఓ విషయం గుర్తుంచుకోవాలని.. అదేమిటంటే ఆయన చేసిన పాపాలను క్షమాపణలు లేవన్నారు. జగన్ వెళ్లి కన్ఫెషన్ బాక్సులో కూర్చున్నా కూడా ఏసు ప్రభువు ఆయన్ను క్షమించరని పేర్కొన్నారు. భగవంతుడి విషయంలో అహంకారపూరితంగా మాట్లాడిన వైయస్ జగన్ ఇప్పటికైనా ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదే విధంగా తాను చేసిన తప్పుకు లెంపలు వేసుకోవాలని సూచించారు. వైసీపీలోని హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా ఇతర మతాలను దూషిస్తే సమర్థించరని స్పష్టం చేశారు.






