జగన్ కేసీఆర్ సొంత అన్నదమ్ములు, వారిద్దరి రక్తం ఒక్కటే..టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంతానికి ద్రోహం చేశారంటూ ఎమ్మెల్యే సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు కుమ్మక్కై రేవంత్ రెడ్డి కోసం రాయలసీమను మోసం చేశారని జగన్ అంటున్నారన్నారు.

జగన్ కేసీఆర్ సొంత అన్నదమ్ములు, వారిద్దరి రక్తం ఒక్కటే..టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంతానికి ద్రోహం చేశారంటూ ఎమ్మెల్యే సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు కుమ్మక్కై రేవంత్ రెడ్డి కోసం రాయలసీమను మోసం చేశారని జగన్ అంటున్నారన్నారు. ఎన్జీటీ స్టే ఇచ్చినప్పుడు ప్రాజెక్టును ఆపేందుకు ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నారని ప్రశ్నించారు. అప్పుడు తెలంగాణలో కేసీఆర్ సీఎంగా ఉన్నారని మీరిద్దరూ సొంత అన్నదమ్ములు.. ఇద్దరి రక్తం ఒకటేనని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ తో లాలూచీ పడి ఎన్జీటీ స్టే వెకెట్ వేయకుండా లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభించకుండా వదిలేసింది ఎవరు అని ప్రశ్నించారు. మీ హయాంలో చేసిన పాపాలను ఈ రోజు మాకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మా పేర్లు ఎత్తే అర్హత కూడా మీకు లేదని ఇప్పటికైనా సైలెంట్ గా కూర్చోవాలని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లిపోయాయని అనవసరంగా నోరు పారేసుకోవద్దని సూచించారు.

Next Story