- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ మంత్రి కాకాణిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫిర్యాదు
వైసీపీ నాయకుడు.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandra Mohan Reddy) పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ నాయకుడు.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandra Mohan Reddy) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తన ఫిర్యాదును నెల్లూరు రూరల్ పోలీసు స్టేషనులో అందజేశారు. తాను కోట్ల రూపాయలను దోచుకున్నానని కాకాణి నిరాధార ఆరోపణలు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. గుడిని బాగు చేస్తే తనను తప్పుబట్టిన ఘనత మాజీ మంత్రి కాకాణికే దక్కుతుందని అన్నారు. 14.5 ఎకరాలను బడులు, ఆసుపత్రులకు ఇచ్చిన చరిత్ర తమదని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అత్తగారి భూముల పేరుతో పక్క భూములు ఆక్రమించుకున్న చరిత్ర కాకాణిది అని ఆరోపణలను గుప్పించారు. కాకాణి కండిషన్ బెయిల్ పై ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. పద్ధతి మార్చుకోకపోతే కాకాణి, అతని అనుచరులు జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
సోమిరెడ్డిపై కాకాణి ఆరోపణలు
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy) ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఇటీవల పలు ఆరోపణలను చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆలయ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని, వాటిని పరిరక్షించాలని అన్నారు. ఈ మేరకు గత నవంబరులో ఎమ్మెల్యే సోమిరెడ్డిపై ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనరుకు ఫిర్యాదు చేశారు. కాకుటూరులో దేవుడి భూమిని ఆక్రమించారంటూ ఎమ్మెల్యేపై ఆరోపణలను గుప్పించారు. దేవుని భూమిని రక్షించకపోతే తాను న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇరువురు పరస్పర ఫిర్యాదులతో రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించారు.






