- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ సీఎంపై ఎమ్మెల్యే ప్రత్తిపాటి విమర్శలు
మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు (Prathipati Pulla Rao) విమర్శనాస్త్రాలను సంధించారు.

దిశ, వెబ్ డెస్క్ : మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు (Prathipati Pulla Rao) విమర్శనాస్త్రాలను సంధించారు. జగన్ పాలన ఏ విధంగా ఉండేదో చెబుతూ విమర్శలు చేశారు. ఐదేళ్లలో పాలనలో వైయస్ జగన్ వైఫల్యాలను మూట గట్టుకున్నారని ఆరోపించారు. సోమవారం మాట్లాడుతూ వైసీపీ పాలన ఐదేళ్లపాటు అసుర పాలనలా సాగిందని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలను మరణం అంచు వరకు తీసుకెళ్లిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. ప్రజలు ఒక్క ఛాన్స్ ఇస్తే అమరావతిని అడవిగా మార్చారన్నారు. పోలవరంను గోదారిపాలు చేశారని ఎద్దేవా చేశారు.
అంతేకాకుండా జగన్ నాయకత్వంలోని వైసీపీ పాలనలో సంక్షేమం, అభివృద్ధి అనేవి నేతి బీరకాయలో నెయ్యి చందంగా ఉన్నాయంటే చురుకులు పెట్టారు. ప్రతిరోజూ అత్యాచార ఘటనలతో రాష్ట్రం తల్లడిల్లిపోయేదన్నారు. రైతు ఆత్మహత్యల్లో ఏపీదీ అగ్రస్థానంగా నిలిచిందని గుర్తు చేశారు. అటువంటి పాలన అందించిన వైసీపీ నేడు కూటమి పాలనను చూసి ఓర్వలేకపోతోందన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూడకుండా కేవలం విమర్శలు, ఆరోపణలకే ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఇటువంటి తీరు వల్లనే ప్రజలు వైసీపీని 11 స్థానాలకు పరిమితం చేశారని అభిప్రాయపడ్డారు.






