మా జోలికి రాకుండా ఆదేశాలివ్వండి: హైకోర్టులో పెద్దిరెడ్డి పిటిషన్

by Vemula.Srinu Prasad |

తనపై నమోదైన క్రిమినల్ కేసు విషయంలో హైకోర్టును ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఆశ్రయించారు..

మా జోలికి రాకుండా ఆదేశాలివ్వండి: హైకోర్టులో పెద్దిరెడ్డి పిటిషన్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి(Ycp Mla Peddireddy Rama Chandra Reddy)పై అటవీ శాఖ(Forest Department) క్రిమినల్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు పెద్దిరెడ్డి హైకోర్టు(High Court)ను ఆశ్రయించారు. తనపై నమోదు అయిన కేసును కొట్టివేయాలని కోరారు. తమ ఆధీనంలో ఉన్న భూముల జోలికి ప్రభుత్వం రాకుండా చూడాలని పిటిషన్‌లో కోరారు. అయితే పిటిషన్‌‌పై ధర్మాసనం రేపో, ఎల్లుండో విచారణ చేపట్టనుంది.

కాగా చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేటలలో 27.98 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేశారని పెద్దిరెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులపైనా పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అక్రమంలో అటవీ భూమిలోకి ప్రవేశించడమే కాకుండా కబ్జా చేసి, జీవ వైవిధ్యానికి కూడా నష్టం కలిగించారని ఎంపీ మిధున్ రెడ్డితో పాటు తంబళ్లపాలెం ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి తమ్ముడి భార్య ఇందిరమ్మపైనా వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఆర్ నమోదు చేశారు. దీంతో ఈ కేసులో పెద్దిరెడ్డిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ముందస్తుగా ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

Next Story