బాలయ్య వరాలు.. హిందూపురానికి కొత్త పరిశ్రమలు

by Vemula.Srinu Prasad |

హిందూపురానికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వరాలు కురిపించారు. ..

బాలయ్య వరాలు.. హిందూపురానికి కొత్త పరిశ్రమలు
X

దిశ, వెబ్ డెస్క్: హిందూపురానికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Mla Balakrishna) వరాలు కురిపించారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం(Hindhupuram)లో ఆయన పర్యటించారు. హిందూపురం ప్రభుత్వాస్పత్రిని పరిశీలించారు. గత పాలకులు ఈ ఆస్పత్రిని పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వాస్పత్రికి పూర్వవైభవం తీసుకొస్తామని బాలకృష్ణ తెలిపారు. వైద్యుల కొరత, నర్సింగ్ సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఆస్పత్రిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే హిందూపురానికి కొత్త పరిశ్రమలు తీసుకొస్తామని పేర్కొన్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్ సిటీ రానున్నాయన్నారు. స్థానిక యువతకే ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చారు. హిందూపురంలో ఏర్పాటు కొత్త పరిశ్రమలకు రైతుల నుంచి భూములు సేకరిస్తామని, అందుకు గిట్టుబాటు, న్యాయమైన ధర అందిస్తామని తెలిపారు. రైతులు ఆందోళన చెందొద్దని, న్యాయం చేస్తామని బాలయ్య హామీ ఇచ్చారు.

Next Story