MLA Nallamilli: రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే.... ?

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఏం జరుగుతుందనేది ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు...

MLA Nallamilli: రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే.... ?
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటుతోంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు కురిపిస్తోంది. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి(BJP MLA Nallamilli Ramakrishna Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా(East Godavari)లో కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు(MLC Somu Veerraju)తో పాటు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్(Ys Jagan), కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పరిణితి చెందిన రాజకీయాలు చేయడం లేదని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు.

ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు.

Next Story