నెయ్యి కల్తీ వ్యవహారంలో రూ.350 కోట్ల అవినీతి.. ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

by Vemula.Srinu Prasad |

శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందని ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆరోపించారు..

నెయ్యి కల్తీ వ్యవహారంలో రూ.350 కోట్ల అవినీతి.. ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ(Tirumala Srivari Laddu adulterated) వ్యవహారంలో రూ. 350 కోట్లు అవినీతి జరిగిందని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్(TDP MLA Kuna Ravikumar) ఆరోపించారు. లడ్డూ కల్తీ వ్యవహారంపై కోర్టు సిట్ నివేదిక సమర్పించిన నేపథ్యంలో వైసీపీ(Ycp) నేతలు చేస్తున్న విమర్శలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy) సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కల్తీ నెయ్యిపై సీబీఐ ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. పాద్రధారుల కంటే సూత్రధారులు బయటకు రావాలని కూన రవికుమార్ డిమాండ్ చేశారు.

Next Story