- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మళ్లీ ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు...

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Nellore Rural MLA Kotamreddy Sridhar Reddy) మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. కొద్దిరోజులుగా నరాల సంబంధిత సమస్య(Nerve-related problem)తో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం తమిళనాడు వెల్లూరు సీఎంసీ ఆస్పత్రి(Tamil Nadu Vellore CMC Hospital )లో చికిత్స తీసుకుంటున్నారు. నాలుగు రోజులుగా అక్కడి వైద్యుల పర్యవేక్షణలో శ్రీధర్ రెడ్డికి వివిధ పరీక్షలు నిర్వహిస్తుంచారు. అయితే కోటంరెడ్డి ఇటీవల కేరళలోనూ ఆయుర్వేద చికిత్స పొందారు. అక్కడ చికిత్స ముగించుకుని వచ్చిన కొద్దిరోజులకే మళ్లీ అదే సమస్య తలెత్తింది. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆయన్ను కుటుంబ సభ్యులు వెల్లూరుకు తరలించారు. ప్రస్తుతం శ్రీధర్ రెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
సీఎంసీలో కోటంరెడ్డి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు
ప్రస్తుతం సీఎంసీలో కోటంరెడ్డి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు... ఆయనకు మరికొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరమని చెప్పారు. అలాగే మరో వారం పాటు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకోవాలని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో శ్రీధర్ రెడ్డి అక్కడే ఉండనున్నారు. ఈ మేరకు ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, కార్యకర్తలు ఆకాంక్షించారు.






