- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ర్యాంకుల ప్రకటన.. తొలి స్థానంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి
మహానాడువేదికగా తెలుగుదేశం పార్టీ తమ పార్టీ ఎమ్మెల్యేల ప్రగతి నివేదికను వెల్లడించింది. నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధుల పనితీరు, ప్రజలతో వారికున్న అనుబంధం, స్థానిక సమస్యల పరిష్కారంలో వారు చూపుతున్న చొరవ వంటి పలు కీలక అంశాల ఆధారంగా సమగ్ర సర్వేను నిర్వహించారు. ..

దిశ, వెబ్ డెస్క్: మహానాడు(Mahanadu) వేదికగా తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) తమ పార్టీ ఎమ్మెల్యేల ప్రగతి నివేదికను వెల్లడించింది. నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధుల పనితీరు, ప్రజలతో వారికున్న అనుబంధం, స్థానిక సమస్యల పరిష్కారంలో వారు చూపుతున్న చొరవ వంటి పలు కీలక అంశాల ఆధారంగా సమగ్ర సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ఫలితాల ప్రకారమే ఎమ్మెల్యేలకు ర్యాంకులను కేటాయించి అధికారిక జాబితాను విడుదల చేశారు. ఈ ర్యాంకుల జాబితాలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Nellore Rural MLA Kotamreddy Sridhar Reddy) అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. నియోజకవర్గంలో నిరంతరం ప్రజల చెంతనే ఉంటూ, వారి సమస్యలపై రాజీలేని పోరాటం చేయడంతో పాటు నిరంతర ప్రజాక్షేత్ర పర్యటనల ద్వారా ఆయన మొదటి ర్యాంకును సొంతం చేసుకున్నారు. ఈ నివేదిక పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. పార్టీ అధిష్ఠానం ప్రకటించిన ఈ పనితీరు ర్యాంకులు మిగిలిన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశంలా మారనున్నాయి. ప్రజాక్షేత్రంలో మరింత చురుగ్గా పని చేసేందుకు, ప్రజాదరణను పెంపొందించుకునేందుకు ఈ ఫలితాలు ఒక హెచ్చరికగా, మరికొందరికి ప్రోత్సాహకంగా నిలుస్తాయని భావిస్తున్నారు. భవిష్యత్తులో ప్రజలకు మరింత జవాబుదారీగా ఉండేలా ప్రజాప్రతినిధులను సమాయత్తం చేయడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశమని పలువురు టీడీపీ నేతలు తెలిపారు.






