నా ఆరోగ్యంపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది.. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని

by Dishafeatures2 |
Kodali Nani
X

దిశ, వెబ్ డెస్క్: తన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. తనను డైరెక్టుగా ఎదుర్కోలేక తండ్రీకొడుకులు ఇలాంటి చిల్లర ప్రచారాలు చేయిస్తూ శునకానందం పొందుతున్నారని ఆయన అన్నారు. దమ్ముంటే తనను డైరెక్టుగా ఢీకొనాలని సవాలు విసిరారు. చంద్రబాబును రాజకీయాల నుంచి ఇంటికి పంపేవరకు తాను రాజీయాల నుంచి తప్పుకునేది లేదని కొడాలని నాని చెప్పారు.

Next Story

Most Viewed