ఆయన మూసేసినా.. నేను ఓపెన్ చేస్తా: లోకేశ్ రెడ్ బుక్‌పై గుంతకల్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

మంత్రి నారా లోకేశ్ రెడ్ బుక్‌ను మూసివేసినా తాను ఓపెన్ చేస్తానని గుంతకల్ టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు..

ఆయన మూసేసినా.. నేను ఓపెన్ చేస్తా: లోకేశ్ రెడ్ బుక్‌పై గుంతకల్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) రెడ్ బుక్‌ను మూసివేసినా తాను ఓపెన్ చేస్తానని గుంతకల్ టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం(Guntakal TDP MLA Gummanur Jayaram) అన్నారు. 2029లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ(Tdp) నేతల తలలు రప్పా రప్పా నరుకుతామంటూ జగన్(Jagan) పర్యటనలో ప్లకార్డులు ప్రదర్శించడంపై ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత తాను రెడ్ బుక్ తెరుస్తానని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ నాయకులు నామినేషన్లు వేయకుండా చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

కాగా అనంతపురం జిల్లా గుత్తి టీడీపీ పట్ణణ, మండల కమిటీల ఏర్పాటుపై శుక్రవారం పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జయరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకులపై వందల కేసులు పెట్టారని గుర్తు చేశారు. కానీ తాము కేసులు పెట్టాలనుకుంటే వైసీపీ వాళ్లందరిపైనా కేసులు పెట్టేవాళ్లమన్నారు. కానీ తమకు అలాంటి వ్యవహారాలు తెలియదని చెప్పారు. తనను వైసీపీ నేతలు రౌడీ అని, కూనీకోరు అన్నారని మండిపడ్డారు. కార్యకర్తలతోపాటు తాను కూడా వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే జయరాం తెలిపారు.

Next Story