కాణిపాకం వచ్చి ప్రమాణం చేయ్: రోజాకు ఎమ్మెల్యే భాను ప్రకాశ్ సవాల్

by Vemula.Srinu Prasad |

చెన్నైలో ఇసుక అక్రమ రవాణా చేస్తూ మాజీ మంత్రి రోజా(Former Minister Roja) అనుచరులు(కార్పొరేటర్లు) ఇద్దరు అరెస్ట్ కావడం తిరుపతి జిల్లా నగరి(Nagari) నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది.

కాణిపాకం వచ్చి ప్రమాణం చేయ్:  రోజాకు ఎమ్మెల్యే భాను ప్రకాశ్ సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: చెన్నై(Chennai)లో ఇసుక అక్రమ రవాణా చేస్తూ మాజీ మంత్రి రోజా(Former Minister Roja) అనుచరులు(కార్పొరేటర్లు) ఇద్దరు అరెస్ట్ కావడం తిరుపతి జిల్లా నగరి(Nagari) నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటన వేలెత్తి చూపెడుతూ మాజీ మంత్రి రోజా పై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విమర్శలకు దీటుగా వైసీపీ నేతలు సైతం స్ట్రాంగ్‌గా కౌంటర్లు ఇస్తున్నారు. ఇది చినికి చినికి రాజకీయ దుమారానికి కారణమైంది. దీంతో వైసీపీ, టీడీపీ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు వరికి వెళ్లింది.

తాజాగా మాజీ మంత్రి రోజాకు నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్(MLA Gali Bhanu Prakash) సంచలన సవాల్ విసిరారు. గత ఐదేళ్ళుగా ఇసుక, బియ్యం అక్రమ రవాణాలో రోజా, అమె అన్నదమ్ములకు, అనుచరులకు సంబంధం లేదని చెప్పగలదా ? అని ప్రశ్నించారు. రోజా కాణిపాకం వచ్చి ప్రమాణం చేయాలని ఛాలెంజ్ చేశారు. సమయం రోజా చెప్పినా సరే తనను చెప్పమన్నా సరే‌ అంటూ నిలదీశారు. ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని, రోజా రెడీయేనా అని ఎమ్మెల్యే భాను ప్రకాశ్ సవాల్ విసిరారు.

Next Story