Breaking: హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-16 07:55:21  IST  )

హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు..

Breaking: హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Mla Nandamuri Balakrishna) తన నియోజకవర్గంలో పర్యటించారు. హిందూపురం(Hindupuram)లో పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ హిందూపురం రుణం తీర్చుకోలేనిదన్నారు. తన తండ్రిని, అన్నను, తనను హిందూపురం ప్రజలు వరుసగా గెలిపించారని తెలిపారు. హిందూపురం ప్రజలకు నందమూరి ఫ్యామిలీ రుణపడి ఉంటుందని తెలిపారు. చరిత్ర సృష్టించాలన్న, తిరగరాయాలన్నా నందమూరి కుటుంబానికే సాధ్యమన్నారు. హిందూపురం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పని చేస్తానని హామీ ఇచ్చారు. హిందూపురానికి కొత్త కంపెనీలకు తీసుకొస్తామని చెప్పారు. అలాగే నిరుద్యోగులకు సైతం అండగా ఉంటామని నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు.

Next Story