ఆర్మీ ప్యారా జంపింగ్ శిక్షణలో అపశృతి.. నలుగురు సైనికులకు గాయాలు

by Vemula.Srinu Prasad |

అనంతపురం జిల్లా సరిహద్దులోని డొనేకల్, బళ్ళారి జిల్లా వీరాపూర్ ప్రాంతాల్లో ఆర్మీ నిర్వహిస్తున్న పారా జంపింగ్ శిక్షణలో ప్రమాదం చోటుచేసుకుంది...

ఆర్మీ ప్యారా జంపింగ్ శిక్షణలో అపశృతి.. నలుగురు సైనికులకు గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా(Ananthapur) సరిహద్దులోని డొనేకల్(Donekal), బళ్ళారి జిల్లా వీరాపూర్ ప్రాంతాల్లో ఆర్మీ నిర్వహిస్తున్న పారా జంపింగ్ శిక్షణలో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రతి ఏటా ఇక్కడ సైనికులకు విమానం నుంచి వందల అడుగుల ఎత్తు నుంచి పారాచూట్ సాయంతో కిందకు దూకడంలో ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. అయితే ఈరోజు జరిగిన విన్యాసాల్లో భాగంగా విమానం నుంచి కిందకు దూకుతున్న సమయంలో గాలిలో సాంకేతిక కారణాల వల్ల పారాచూట్లు అదుపుతప్పడంతో నలుగురు సైనికులు ఒక్కసారిగా కిందపడి గాయపడ్డారు.

అయితే వారిని వెంటనే తోటి సైనికులు, అధికారులు సమీపంలోని సైనిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాలి వేగంలో మార్పులు రావడం వల్లే పారాచూట్లు అదుపుతప్పి ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనపై సైనిక ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. శిక్షణా ప్రాంతంలో భద్రతా చర్యలను పర్యవేక్షించారు.

Next Story