- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గూడ్స్ రైలు నుంచి యూరియా లూటీ.. పోలీసులు రావడంతో పరారీ
గూడ్స్ రైలు నుంచి దుండగులు యూరియా బస్తాలను లూటీ చేసేందుకు ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల సిబ్బంది అప్రమత్తతతో దుండగులు యూరియా బస్తాలు వదిలి పారిపోయారు. ..

దిశ, వెబ్ డెస్క్: గూడ్స్ రైలు(Goods train) నుంచి దుండగులు యూరియా బస్తాల(Urea Bags)ను లూటీ(Loot) చేసేందుకు ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల సిబ్బంది అప్రమత్తతతో దుండగులు యూరియా బస్తాలు వదిలి పారిపోయారు. కాకినాడ(Kakinada) నుంచి యూరియా బస్తాలతో గూడ్స్ రైలు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. సిగ్నల్ కోసం సామర్లకోట మండలం ఉండూరు సమీపంలో గూడ్స్ రైలు ఆగింది. ఇంతలోనే బోగి తాళం పగలగొట్టి 60 బస్తాలను కిందకు దించారు.
ఆర్పీఎఫ్ పోలీసుల రాకతో దుండగుల పరారీ
అయితే రైల్వే సిబ్బంది అప్రమత్తమైంది. వెంటనే ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం అందించారు. తక్షణమే స్పాట్‌కు ఆర్పీఎఫ్ పోలీసులు(RPF police) చేరుకున్నారు. దీంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. గూడ్స్ రైలు నుంచి దుండగులు కిందకు దించిన యూరియా బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఆర్పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేసి స్థానిక పోలీసుల సాయంతో నిందితుల కోసం గాలిస్తున్నారు.






