- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో అపచారం.. శ్రీవారి ఆలయ మాడవీధుల్లో యువకుడు చేసిన పనికి అంతా షాక్!
తిరుమల(Tirumala)లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala)లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలోని కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) తరలి వస్తారనే విషయం తెలిసిందే. అయితే తిరుమలలో ఓ యువకుడు వీరంగం సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం ఓ యువకుడు మద్యం తాగి శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో హల్‌చల్ సృష్టించాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ మహిళతో గొడవకు దిగాడు.
అర్ధరాత్రి మహిళతో పాటు ప్రశ్నించిన విజిలెన్స్ సిబ్బందితోనూ యువకుడు గొడవకు దిగాడు. అంతటితో ఆగకుండా ‘తాను మద్యం తాగుతాను.. కావాలంటే ఇక్కడే మద్యం కూడా అమ్ముతాను’ అంటూ ఆ యువకుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో తిరుమలలో అపచారం చోటుచేసుకుందని.. అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు(Police) యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అతని పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.






