పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల వేళ.. మైనారిటీ విభాగం కీలక పిలుపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-11 11:20:25  IST  )

పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల వేళ మైనారిటీ విభాగం కీలక పిలుపునిచ్చింది...

పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల వేళ.. మైనారిటీ విభాగం కీలక పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: ముస్లింల సమస్యలపై వైసీపీ ముందు నుంచి పోరాడుతుందని వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వి. ఖాదర్ భాషా అన్నారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల వేళ ఆయన ముస్లిం ఓటర్లకు ఆయన కీలక పిలుపునిచ్చారు. తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అడుగుజాడల్లో జగన్‌ నడిచారని, గత ఐదేళ్లు మైనారిటీల సంక్షేమం, అభివృద్దికి పెద్దపీట వేశారని తెలిపారు. చంద్రబాబు నాయుడు మైనారిటీలకు ఇచ్చిన ఒక్క వాగ్ధానం అమలు చేయలేదని, జగన్‌ ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని అమలుచేశారన్నారు. జగన్ హయాంలో మైనారిటీల అభివృద్ధికి రూ. 23 వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. చంద్రబాబు మనసులో మైనారిటీలు అంటే ద్వితీయ శ్రేణి పౌరులని, వక్ఫ్‌ బిల్లుకు వ్యతిరేకం అని చెప్పారని, కానీ మద్దతిచ్చారని గుర్తు చేశారు. టీడీపీ, జనసేన ముస్లింలకు తీరని అన్యాయం చేశాయని ఆరోపించారు. ఒక్క వైసీపీ మాత్రమే ముస్లింల వెంట నడిచిందని చెప్పారు. ముస్లిం సమాజం అంతా వైసీపీ వెంట నడవాలని ఖాదర్ భాషా పిలుపునిచ్చారు.

వీడియో


👉Also Read: పోలింగ్ బూత్‌ల మార్పుపై హైకోర్టులో సవాల్.. కాసేపట్లో తీర్పు

Next Story