- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధర్మవరంలో దారుణం.. బాలికపై పెంపుడు తండ్రి, బావమరిది అత్యాచారం
పెంపుడు తండ్రి 14 ఏళ్ల బాలికపై కన్నేశాడు. ఆమెపై నెలల తరబడి తన బావమరిదితో కలిసి

దిశ, వెబ్‌డెస్క్: పెంపుడు తండ్రి 14 ఏళ్ల బాలికపై కన్నేశాడు. ఆమెపై నెలల తరబడి తన బావమరిదితో కలిసి అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఇంతలో బాలిక అస్వస్థతకు గురికావడంతో.. పెంపుడు తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లగా బాలికకు వైద్యపరీక్షలు చేసి గర్భిణీ అని తేల్చారు. దీంతో తన తమ్ముడే ఇందుకు కారణమై ఉంటాడని భావించిన పెంపుడు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఉండే జంట 14 ఏళ్ల క్రితం చిత్తూరు జిల్లా బోయకొండ గంగమ్మ ఆలయ ప్రాంతం నుంచి ఓ ఆడశిశువును తెచ్చుకుని పెంచుకుంటున్నారు. బాలిక వయసుకు రావడంతో ఆమెపై పెంపుడు తండ్రి కన్ను పడింది. తన బావమరిది కూడా ఆశపడుతున్నాడని తెలిసి అతనితో కలిసి దారుణానికి ఒడిగట్టాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించడంతో తల్లికి విషయం చెప్పలేదు.
ఆదివారం అస్వస్థతకు గురైన బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రెగ్నెంట్ అని తెలిసింది. దీంతో తల్లి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను డీఎస్పీ హేమంత్ కుమార్ విచారణ చేయగా.. పెంపుడు తండ్రితో పాటు, అతని బావమరిది కూడా తనపై అత్యాచారం చేసినట్లు తెలిపింది. బాలిక ఫిర్యాదు మేరకు ఇద్దరిపై పోక్సో కేసు నమోదు చేశారు. విషయం పోలీసులకు తెలిసిందని తెలుసుకున్న ఇద్దరూ పరారీలో ఉన్నారు.






