నేడు సీఎం చంద్రబాబు బర్త్ డే.. విషెస్ తెలిపిన మంత్రులు

by Jakkula.Mamatha |   (  Updated:2025-04-20 04:31:46  IST  )

ఏపీ సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

నేడు సీఎం చంద్రబాబు బర్త్ డే.. విషెస్ తెలిపిన మంత్రులు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, మంత్రి అనగాని సత్యప్రసాద్ సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రి అచ్చెన్నాయుడు

సీఎం చంద్రబాబుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. క్రమశిక్షణలో, అంకిత భావంతో, భవిష్యత్తు కార్యాచరణలో, సంక్షోభాలను సంక్షేమం గా మార్చడంలో దేశంలోని నాయకులకే సీఎం చంద్రబాబు ఆదర్శమని తెలిపారు. ప్రజా రాజధాని అమరావతి సృష్టికర్త, పోలవరంతో తెలుగు నేలను సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తున్న మహోన్నత వ్యక్తి, రైతాంగానికి భరోసా ఇచ్చేందుకు పథకాలు తిరిగి ప్రారంభించిన మహనీయులు సీఎం చంద్రబాబు అని కొనియాడారు. సీఎం చంద్రబాబు సారధ్యంలో నవ్యాంధ్ర దేశంలోనే అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

మంత్రి అనగాని సత్యప్రసాద్

మా విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం రాత్రి పగలు శ్రమిస్తున్న సీఎం చంద్రబాబుకు సంపూర్ణ ఆయుష్షును, ఆనందాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ప్రజలే చంద్రబాబు బలం.. ప్రజల కోసమే ఆయన జీవితం నవ నిర్మాణ దీక్ష దక్షుడు అన్నారు. అమరావతి రూపశిల్పి సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పూర్తిగా పేదరిక నిర్మూలన చేయాలని పెట్టుకున్న సంకల్పం నెరవేరాలని కోరుకుంటున్నానని మంత్రి తెలిపారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలో ఎక్కువ పర్యాయాల పాటు ప్రజలకు సేవలు అందించాలని భావిస్తున్నానని మంత్రి సత్య కుమార్ తెలిపారు. అలుపెరుగని శ్రామికుడైన సీఎం చంద్రబాబు సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.

Next Story