నేడు ఉద్యోగ సంఘాలతో మంత్రుల భేటీ

by Ajay Maddhiboyina |

నేడు ఉద్యోగ సంఘాల నాయ‌కుల‌తో మంత్రులు భేటీ కానున్నారు. ఉద‌యం 11 గంట‌ల‌కు స‌చివాల‌యంలో ఉద్యోగ సంఘాల నాయ‌కుల‌తో మంత్రులు ప‌య్యావుల‌, నాదెండ్ల మ‌నోహ‌ర్, స‌త్య‌కుమార్ స‌మావేశం అవుతారు.

నేడు ఉద్యోగ సంఘాలతో మంత్రుల భేటీ
X

దిశ‌, వెబ్ డెస్క్: నేడు ఉద్యోగ సంఘాల నాయ‌కుల‌తో మంత్రులు భేటీ కానున్నారు. ఉద‌యం 11 గంట‌ల‌కు స‌చివాల‌యంలో ఉద్యోగ సంఘాల నాయ‌కుల‌తో మంత్రులు ప‌య్యావుల‌, నాదెండ్ల మ‌నోహ‌ర్, స‌త్య‌కుమార్ స‌మావేశం అవుతారు. ఉద్యోగుల డీఏ, ఇత‌ర అంశాల‌పై వారితో చ‌ర్చించ‌నున్నారు. సమావేశం ఆర్థిక, ప్రణాళిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వయ్యావుల కేశవ్ అధ్యక్షతన జరగనుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయనంద్ ఐఏఎస్, ఆర్థిక , ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఐఏఎస్, ఆర్థిక శాఖ, కార్యదర్శి వి. వినయ్ చంద్ ఐఏఎస్ సైతం సమావేశంలో పాల్గొంటారు. ఇదిలా ఉంటే కొద్దిరోజులుగా ఉద్యోగులకు సంబంధించిన ఆర్థికపరమైన డిమాండ్లపై సీఎం చంద్రబాబు, సీఎస్ సమీక్షిస్తున్నారు. ఉద్యోగుల పెండింగ్ అంశాల పరిష్కారానికి మార్గం కనుగొనాలని అధికారులకు సూచించారు.

Next Story