- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ రెండు పథకాల అమలుపై.. మంత్రి కీలక ప్రకటన
ఏపీ(Andhra Pradesh)లో నేడు(శుక్రవారం) 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో నేడు(శుక్రవారం) 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మంత్రి పొంగూరు నారాయణ(Minister Ponguru Narayana) మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు(Self Finance Project) అని మంత్రి తెలిపారు. అమరావతికి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి అదనంగా ఖర్చు పెట్టడం లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. దీని కోసం ప్రపంచ బ్యాంకు(World bank), హడ్కో(HADCO) రుణాలు ఇచ్చాయని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే రూ.48 వేల కోట్ల మేర పనులకు టెండర్లు పిలిచినట్లు మంత్రి నారాయణ తెలిపారు. అలాగే రాష్ట్రంలో మే నెలలో ‘తల్లికి వందనం’ పథకం ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. మున్సిప్సాలటీలలో బిల్లులు చెల్లించే అధికారాన్ని తిరిగి వారికి అప్పగిస్తూ బడ్జెట్(AP Budget)లో నిర్ణయించడం సంతోషించాల్సిన అంశం అన్నారు. CFMS నుంచి చెల్లించే విధానం నుంచి విముక్తి కలుగుతుందన్నారు. మున్సిపల్ శాఖకు రూ.13 వేల కోట్లు కేటాయింపులు చేశారని, అందులో రూ.6వేల కోట్లు CRDA కు చెందినవే అని తెలిపారు.






