విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం.. మంత్రి కీలక ప్రకటన

by Jakkula.Mamatha |

ఏపీలో పునరుత్పాదక విద్యుత్‌తో పని చేసే ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ భవనాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇవాళ(శుక్రవారం) ప్రారంభించారు.

విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం.. మంత్రి కీలక ప్రకటన
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో పునరుత్పాదక విద్యుత్‌తో పని చేసే ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ భవనాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇవాళ(శుక్రవారం) ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి(Minister Gottipati ravi kumar) మాట్లాడుతూ.. 50 శాతం విద్యుత్ ఆదా అయ్యేలా విశాఖపట్నంలో ఈసీబీసీ భవనాన్ని నిర్మించారు. ఈసీబీసీ నిబంధనలకు అనుగుణంగా రూ.14 కోట్లతో ఈ నిర్మాణం చేపట్టారు. రాష్ట్రం(Andhra Pradesh)లో కరెంట్ ఛార్జీలు పెంచబోమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచకూడదని సీఎం చంద్రబాబు(CM Chandrababu) స్పష్టమైన ఆదేశాలిచ్చారని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు 24 గంటలు, రైతులకు 9 గంటల నిరంతరమైన నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తామని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. ఈ తరుణంలో వచ్చే ఎన్నికల(2029) నాటికి విద్యుత్ ఛార్జీలు తగ్గించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం(AP Government) పని చేస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.

Next Story