సూపర్ హిట్ సభకు సిద్ధం.. అనంతపురంలో మంత్రులు

by Thanuru Gopichand |

అనంతపురం వేదికగా రేపు జరగనున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు వంగలపూడి అనిత, కింజారపు అచ్చెన్నాయుడు ఈ రోజు మధ్యాహ్నం పరిశీలించారు.

సూపర్ హిట్ సభకు సిద్ధం.. అనంతపురంలో మంత్రులు
X

సూపర్ హిట్ సభకు సిద్ధం.. అనంతపురంలో మంత్రులు

దిశ, డైనమిక్ బ్యూరో : అనంతపురం వేదికగా రేపు జరగనున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు వంగలపూడి అనిత, కింజారపు అచ్చెన్నాయుడు ఈ రోజు మధ్యాహ్నం పరిశీలించారు. సూపర్ సిక్స్ సూర్ హిట్ విజయోత్సవ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలి రానున్నందున భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు ఉండకూడదని మంత్రి అనిత అధికారులను ఆదేశించారు. డ్రోన్లతో భద్రతా ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణతో పాటు బారికేడ్ల ఏర్పాట్లు, సభా వేదిక ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో చర్చించి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. రేపు మధ్యాహ్నం జరగబోయే సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభకుసీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తో పాటు కూటమి పార్టీల ముఖ్యనేతలు హాజరు కానున్నారు.

సభ ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రజల సమూహం అధికంగా తర లివచ్చే అవకాశం ఉండటంతో, ప్రతి చిన్న అంశంపైనా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా సభావేదిక నిర్మాణం, సౌండ్, లైటింగ్, విద్యుత్, తాగునీటి సౌకర్యం, పార్కింగ్, రవాణా సౌకర్యం, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య శిబిరాలు, అత్యవసర వసతులు వంటి ఏర్పాట్ల‌పై అధికారులు, నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. సూపర్ సిక్స్-సూప‌ర్ హిట్ సభ సాధారణ సభ కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వాసానికి ప్రతీక అని ఆయన అన్నారు. ఈ సభలో లక్షలాది మంది హాజరయ్యే అవకాశం ఉంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రజలు సౌకర్యంగా పాల్గొనే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

Next Story