- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
kandula Durgesh:రుషికొండ బీచ్‌ను సందర్శించిన మంత్రి.. ఆ అంశాలపై చర్చలు
రుషికొండను బీచ్‌ను ఇవాళ(గురువారం) ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సందర్శించారు.

దిశ,వెబ్‌డెస్క్: రుషికొండను బీచ్‌ను ఇవాళ(గురువారం) ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సందర్శించారు. ఈ క్రమంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పునరుద్ధరణ తర్వాత పరిస్థితులను పరిశీలించారు. అనంతరం పర్యాటక సందడి పెరగడానికి అవసరమైన చర్యలపై మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ.. విశాఖ అనగానే సుందరమైన ప్రకృతి, రమణీయత ప్రాంతాలు కళ్లముందు కదలాడుతాయని అన్నారు. బ్లూ ఫాగ్ బీచ్ సర్టిఫికేషన్ అంటే ఎన్నో పారామీటర్స్ చూసి అందించే అంతర్జాతీయ స్థాయి గుర్తింపు అన్నారు. బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ ఉన్న బీచ్‌లను విదేశీ పర్యాటకులు సైతం ఎక్కువగా సందర్శించే వీలుందన్నారు. ఈ క్రమంలో డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఈఈ) సంస్థ అందించిన బ్లూఫాగ్ సర్టిఫికేషన్ ను నిర్ణీత ప్రమాణాలు పాటించి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
బీచ్‌లో దుకాణాలు నడుపుతున్నవాళ్లు, లైఫ్ గార్డులు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలకు తగిన పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. బీచ్‌లో బ్లూ ఫ్లాగ్ ప్రమాణాల స్థాయిని కొనసాగించడమే కాకుండా బీచ్ సుందరీకరణకు మరిన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అదే విధంగా బీచ్ లో పర్యాటక సందడి పెరగడానికి అవసరమైన చర్యలపై చర్చించామని మంత్రి తెలిపారు. అనంతరం బీచ్ రోడ్డులో తిరగనున్న డబుల్ డెక్కర్ ఈవీ బస్సులను పరిశీలించారు. పర్యాటక ఆకర్షణగా నిలవబోతున్న హప్ ఆన్, హప్ ఆఫ్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు త్వరలోనే విశాఖ నగరంలో సేవలందిస్తాయని తెలిపారు. పర్యాటకులకు, నగరవాసులకు అనుభూతి భరితమైన, పర్యావరణహితమైన ప్రయాణాన్ని అందిస్తాయన్నారు. డబుల్ డెక్కర్ బస్సులు విశాఖ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో తీసుకెళ్తుందని మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో సరైన రాజకీయ నాయకత్వం లేకపోవడంవల్ల పుదుచ్చేరి ప్రభుత్వం ఆపేసిన కార్డేలియా సముద్ర విహార నౌకను తిరిగి ప్రారంభించామని మంత్రి దుర్గేష్ గుర్తుచేశారు.






