వైసీపీ హయాంలో ఆలయాలపై ఎన్ని దాడులు జరిగినా పట్టించుకోలేదు.. మంత్రి వాసంశెట్టి ఫైర్

by Ajay Maddhiboyina |

ద్రాక్షారామం శివ‌లింగం ధ్వంసం ఘ‌ట‌న‌పై మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు. శివ‌లింగం ధ్వంసం చేయ‌డం విషాద‌క‌రం అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

వైసీపీ హయాంలో ఆలయాలపై ఎన్ని దాడులు జరిగినా పట్టించుకోలేదు.. మంత్రి వాసంశెట్టి ఫైర్
X

దిశ‌, వెబ్ డెస్క్: ద్రాక్షారామం శివ‌లింగం ధ్వంసం ఘ‌ట‌న‌పై మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు. శివ‌లింగం ధ్వంసం చేయ‌డం విషాద‌క‌రం అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. శ్రీనివాస్ అనే వ్య‌క్తి గున‌పం, రాడ్డుల‌తో శివ‌లింగాన్ని విచ్చిన్నం చేశాడ‌ని అన్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన‌ పోలీసులు స‌మ‌ర్థ‌వంతంగా విచార‌ణ చేప‌ట్టి వెంట‌నే నిందితుడిని గుర్తించార‌ని అన్నారు. వైసీపీ హ‌యాంలో ఆల‌యాల‌పై ఎన్ని దాడులు జ‌రిగినా ప్ర‌భుత్వం మొక్కుబ‌డిగా వ్య‌వ‌హ‌రించిందని వ్యాఖ్యానించారు. అంత‌ర్వేదిలో రథానికి మంట అంటుకుంటే నిందితుల‌ను ప‌ట్టుకోకుండా చివ‌రికి ఓ వ్య‌క్తిని చూపించి ఉన్మాది అన్నార‌ని చెప్పారు. కృష్ణాజిల్లాలో ఆంజ‌నేయ విగ్ర‌హం విచ్చిన్నం చేసిన‌ప్పుడు కూడా నిర్ల‌క్ష్యంగా మాట్లాడార‌ని అన్నారు. కానీ ఈ ప్ర‌భుత్వం అలాంటిది కాద‌న్నారు. 8గంట‌లు స‌మ‌యం ఇస్తే పోలీసులు ఆరు గంట‌ల్లోనే నిందితున్ని ప‌ట్టుకున్నార‌ని వ్యాఖ్యానించారు. వైసీసీ నేత‌ల మాట‌లు దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్టు ఉన్నాయ‌ని విమ‌ర్శించారు.

Next Story