- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆయిల్ పామ్ రైతులకు లాభదాయకమైన పంట: మంత్రి తుమ్మల
ఆయిల్ పామ్ పంట రైతులకు అత్యంత లాభదాయకమైన పంటగా మారుతుందని, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి స్థిరమైన ఆదాయం పొందే అవకాశముందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ఆయిల్ పామ్ పంట రైతులకు అత్యంత లాభదాయకమైన పంటగా మారుతుందని, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి స్థిరమైన ఆదాయం పొందే అవకాశముందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. శనివారం నంగనూర్ మండలం, నర్మెట్ట గ్రామంలో ఏర్పాటు చేసిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సందర్శించారు. ఫ్యాక్టరీలోని వివిధ విభాగాలను సందర్శించి, ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్ స్వీకరణ, ప్రాసెసింగ్ విధానం, ఆయిల్ ఉత్పత్తి సామర్థ్యం, నిల్వ సదుపాయాలు, యంత్రాల పనితీరు మరియు నాణ్యత ప్రమాణాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. రైతుల నుంచి ఫ్యాక్టరీ వరకు ముడి సరుకు రవాణా, తూకం ప్రక్రియ, చెల్లింపుల విధానంపై అధికారులతో చర్చించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్ పామ్ సాగును మరింత విస్తరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తోందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో, ప్రారంభోత్సవ ఏర్పాట్లను అధికారులతో కలిసి సమగ్రంగా పరిశీలించామన్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు మరియు ఇతర చర్యలను సమన్వయంతో చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. రైతుల సంక్షేమం మరియు వ్యవసాయాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతుల ఆదాయం గణనీయంగా పెంపొందుతుందని తెలిపారు. అనంతరం ఆయిల్ పామ్ రైతులతో సమావేశమై వారితో ప్రత్యక్షంగా మాట్లాడి, పంట సాగులో ఎదురవుతున్న సమస్యలు, ఇబ్బందులు, సూచనలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సమయానికి కొనుగోలు, పారదర్శక చెల్లింపులు సాంకేతిక సహాయం అందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈసమావేశంలో ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి, ఆయిల్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ యాస్మిన్ బాషా , ప్రాజెక్ట్ మేనేజర్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






