విశాఖ స్టీల్ ప్లాంట్‌కు పూర్తి మద్దతు: టీజీ భరత్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-22 17:30:21  IST  )

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు పూర్తిగా మద్దతు ఇస్తున్నామని మంత్రి టీజీ భరత్ అన్నారు...

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు పూర్తి మద్దతు: టీజీ భరత్
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్‌(Visakhapatnam Steel Plant)కు పూర్తిగా మద్దతు ఇస్తున్నామని మంత్రి టీజీ భరత్(Minister TG Bharat) అన్నారు. స్టీల్ ప్లాంట్‌ను సందర్శించిన ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత సెప్టెంబర్ నుంచి ప్లాంట్‌లో ఉక్కు ఉత్పత్తి బాగా పెరిగిందని చెప్పారు. నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయాలన్నారు. కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. ఇందుకోసం తేలియాడే సౌరవిద్యుత్‌(Solar Power)ను వినియోగించాలని, టెక్నికల్ అడ్డంకులను తొలగించాలన్నారు. ప్లాంట్‌లో ఖర్చు ఆదా వ్యూహాలను అమలు చేయాలని చెప్పారు. క్యాప్టివ్ మైన్స్ వ్యవహారాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు(Cm Chandrababu) ప్రయత్నం చేస్తున్నారని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.

Next Story