పది జన్మలెత్తినా అమరావతిని అడ్డుకోలేవ్: జగన్‌పై మంత్రి సవిత ఫైర్

by Vemula.Srinu Prasad |

జగన్ పది జన్మలెత్తినా అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోలేడని, సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో సీమాంధ్రుల కలల రాజధానిని నిర్మించి తీరుతామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు...

పది జన్మలెత్తినా అమరావతిని అడ్డుకోలేవ్: జగన్‌పై మంత్రి సవిత ఫైర్
X

దిశ, ఏపీ బ్యూరో / పెనుకొండ: జగన్ పది జన్మలెత్తినా అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోలేడని, సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో సీమాంధ్రుల కలల రాజధానిని నిర్మించి తీరుతామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. లండన్ మందులు పని చేయకపోవడంతో జగన్ బుర్ర పనిచేయడం లేదని, ప్రతి ఎన్నికల ముందు రాజధానిపై ఆయన తన స్టాండ్ మారుస్తున్నారని మండిపడ్డారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. తల్లికి, చెల్లికి గౌరవమివ్వమని జగన్, రాష్ట్రంలోని మిగిలిన మహిళల పట్ల చులనకభావంతో చూస్తూ, అవమానిస్తున్నారని మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. హోంమంత్రి అనిత కట్టుబొట్టు కోసం మాట్లాడిన వైసీపీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ తల్లి పెంపకం ఇదేనా..? అని ఘాటుగా విమర్శించారు. ప్రతి ఎన్నికల ముందు రాజధాని అంశంపై స్టాండ్ మారుస్తున్నారన్నారు. 2019 ఎన్నికల్లో అమరావతికి జైకొట్టి, ప్రజలను వంచించి జగన్ అధికారంలోకి వచ్చారన్నారు. సీఎం కుర్చీ ఎక్కగానే మాట మార్చి, మూడు రాజధానులు అంటూ కొత్త డ్రామాకు తెరతీశారన్నారు. అయిదేళ్ల పాటు మూడు రాజధానులపై మాట్లాడడమే తప్ప, ఏ ప్రాంతంలోనూ బస్తా సిమ్మెంట్ కూడా వేయలేదన్నారు. 2024 ఎన్నికల్లో మూడు రాజధానులు అంటూ హడావుడి చేసిన జగన్ కు రాష్ట్ర ప్రజలు సరైన గుణపాఠం చెప్పారన్నారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లకే పరిమితం చేశారన్నారు. బుద్ధి మారని జగన్... ఇపుడు మావిగన్ అంటూ మరో డ్రామాకు తెరతీశారన్నారు. రాజధాని అంశంపై రోజుకో పిల్లిమొగ్గ వేస్తున్న జగన్ ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఆయన పది జన్మలెత్తినా అమరావతి రాజధానిని అడ్డుకోలేరన్నారు.

వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీకి సమాధి ఖాయం

రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని మంత్రి సవిత స్పష్టంచేశారు. జగన్ నోటా శాంతిభద్రతలు మాట రావడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ హయాంలో ప్రతిపక్షాలపైనా, ప్రజలపైనా అక్రమ కేసులు బనాయించి నిర్బంధించారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాతే ప్రజలు ఊపిరిపీల్చుకున్నారన్నారు. తాము కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే, ఒక్క వైసీపీ నాయకుడు కూడా బయటతిరగలేరన్నారు. రైతుల గురించి జగన్ మాట్లాడడం సిగ్గు చేటన్నారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్.. ఏరోజు కూడా రైతులను, వ్యవసాయ రంగాన్ని పట్టించకున్న పాపాన పోలేదన్నారు. సీఎం చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్న సమయాల్లోనే రైతులకు మేలు జరిగేదాని రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారని మంత్రి సవిత తెలిపారు.

అమర్నాథ్... ఇదేనా నీ తల్లి పెంపకం..?

జగన్ రెడ్డికి మహిళలంటే చిన్నచూపు అని, అందుకే వారిని అవమానిస్తుంటారని మంత్రి సవిత మండిపడ్డారు. ఇంట్లో తల్లిని, చెల్లిని గౌరవిమవ్వని జగన్... రాష్ట్రంలో ఉన్న మిగిలిన మహిళల పట్ల అలాగే ప్రవర్తిస్తున్నాడని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని అవమానించినప్పుడు జగన్ పైశాచిక ఆనందాన్ని పొందారన్నారు. అమరావతి ప్రాంత మహిళలను, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని తీవ్రంగా అవమానించారన్నారు. హోంమంత్రి అనితపై వైసీపీ నాయకుడు అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తంచేశారు. హోంమంత్రి కట్టుబొట్టునుద్దేశించి అమర్నాథ్ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఇదేనా ఆయన తల్లి పెంపకమని ప్రశ్నించారు. మహిళలను అవమానపరిచిన ఎంతవారైనా భూస్థాపితం కావాల్సిందేనని, ఇదే చరిత్ర చెబుతోందని మంత్రి సవిత హెచ్చరించారు.

Next Story