- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వలస పక్షులను నమ్మొద్దు: జగన్‌పై మంత్రి సవిత సెటైర్లు
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి.. వాళ్లకున్న నాలెడ్జ్‌తో రాష్ట్రాన్ని దిగజార్చారని వైఎస్ జగన్‌పైనా, వైసీపీ నాయకులపైనా మంత్రి సవిత మండిపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి.. వాళ్లకున్న నాలెడ్జ్‌తో రాష్ట్రాన్ని దిగజార్చారని వైఎస్ జగన్(YS Jagan) పైనా, వైసీపీ(Ycp) నాయకులపైనా మంత్రి సవిత(Minister Savita) మండిపడ్డారు. నిజంగా వాళ్లకు నాలెడ్జే ఉంటే కళ్యాణదుర్గంలో తంతే పెనుకొండలో ఎందుకు పడ్డారని ఉషశ్రీ చరణ్ నుద్దేశించి ఆమె ఎద్దేశా చేశారు. బెంగుళూరు వయా కళ్యాణదుర్గం(Kalyanadurg) వయా పెనుకొండ వయా బెంగుళూరుకు సర్వీసులు చేసే వలస పక్షులను నమ్ముకోవొద్దని వైసీపీ నాయకులను మంత్రి సవిత సూచించారు. నియోజక వర్గ అభివృద్ధికి రేయింబవళ్లు కృషి చేస్తున్నానని, తనకు సహకరించాలని వైసీపీ నాయకులకు పిలుపునిచ్చారు.
నోరు జారితే ఖబడ్దార్....
చెప్పులు అందరికీ ఉంటాయని, తాము వేయించగలమని, కాని, తమ నాయకుడు క్రమశిక్షణతో మెలగాలని దిశా నిర్దేశం చేశారని మంత్రి సవిత తెలిపారు. అందుకే, వాళ్లెంత రెచ్చగొడుతున్నా సంయమనంతో, సంస్కారంతో వ్యవహరిస్తున్నామన్నారు. నోరు ఉంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడితే సహించేది లేదంటూ ఖబడ్డార్ అని మంత్రి సవిత హెచ్చరించారు.






