- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ పేరేత్తే హక్కు కూడా జగన్‌కు లేదు: మంత్రి సత్యకుమార్ యాదవ్
సీఎం చంద్రబాబు పేరెత్తే హక్కు కూడా జగన్ కు లేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు...

దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై మాజీ సీఎం జగన్(Former Cm Jagan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గుంటూరు క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన జగన్.. సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu)పై విమర్శలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలకు మంత్రి సత్యకుమార్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ పాలనలో పలు హామీలను విస్మరించి.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు. అభివృద్ధికి మారుపేరైన సీఎం చంద్రబాబు పేరెత్తే అర్హత జగన్ రెడ్డికి లేదన్నారు. ఐదేళ్లపాటు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఇప్పుడు ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కు జగన్‌కు లేదని చెప్పారు.
‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party) నేతల నరుకుడు భాషను జగన్ సమర్ధించడం దుర్మార్గం. రప్పారెడ్డి ముసుగు తొలగించి నిస్సిగ్గుగా జగన్ మాట్లాడారు. ఐదేళ్ల పాలనలో ఒక ఎకరాకు కూడా నీరివ్వని జగన్ రైతుల పట్ల మొసలి కన్నీరు కార్చుతున్నారు. ఐదేళ్ల అధికారంలో తనమాటే శాసనంగా వ్యవహరించారు. ఉన్నత పోలీసు అధికారులను ఇష్టమొచ్చినట్లు సమర్థించారు.’’ అని మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యానించారు.






