ధైర్యం ఉంటే జైలుకు పంపు: జగన్‌కు మంత్రి సత్యకుమార్ సవాల్

by Vemula.Srinu Prasad |

వైసీపీ అధినేత జగన్‌కు ధైర్యం ఉంటే తనను జైలుకు పంపాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సవాల్ విసిరారు. ..

ధైర్యం ఉంటే  జైలుకు పంపు: జగన్‌కు మంత్రి సత్యకుమార్ సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌(Ycp Chief Ys Jagan)కు ధైర్యం ఉంటే తనను జైలుకు పంపాలని మంత్రి సత్యకుమార్ యాదవ్(Minsiter Satyakumar) సవాల్ విసిరారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల(Government Medical Colleges)పై జగన్ చేస్తున్న రాద్ధాంతంపై ఆయన మండిపడ్డారు. పీపీపీ మోడల్ విధానాన్ని ప్రధాని మోడీ తీసుకొచ్చారని.. మరి ఆయన్ను కూడా జైలుకు పంపుతారా అని సత్యకుమార్ ప్రశ్నించారు. జగన్ మానస్థిక స్థితి బాగోలేదు కాబట్టే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారని విమర్శించారు. పేదలకు కూటమి ప్రభుత్వం మంచి చేస్తుంటే జగన్ కుట్రలకు తెరతీస్తున్నారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీల నిర్మాణాల కోసం ప్రైవేటు సంస్థలు వస్తే జగన్ బెదిరించే పరిస్థితికి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిలేదని విమర్శించారు. కోటి సంతకాల పేరుతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని మంత్రి సత్యకుమార్ ఆరోపించారు.

Next Story