- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పై మంత్రి సత్యకుమార్ సీరియస్
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం తీవ్ర కలకలం రేపిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్(Srushti Fertility Center) ఘటనపై ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్య కుమార్(Minister Satya Kumar) సీరియస్ అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం తీవ్ర కలకలం రేపిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్(Srushti Fertility Center) ఘటనపై ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్య కుమార్(Minister Satya Kumar) సీరియస్ అయ్యారు. ఏపీలో ఉన్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్స్ లో తనిఖీలు నిర్వహించి, పనితీరును సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. ఏవైనా అక్రమాలు బయటపడితే, నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగా పంజాబ్ కు చెందిన ఓ జంట తమకు ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా కలిగిన బాబుకు తండ్రి DNA మ్యాచ్ కాకపోవడంపై సృష్టి ఆసుపత్రి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి.
రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో బ్రాంచ్ లు కలిగిన ఉన్న ఈ ఫెర్టిలిటీ సెంటర్లో అక్రమంగా వీర్యం నిలువ చేస్తున్నారని తేలింది. అంతేకాదు ఎలాంటి సరోగసి విధానం లేకుండానే, పుట్టిన పసిగుడ్డులను అక్రమంగా తరలించి, పిల్లలు లేని తల్లిదండ్రులకు సరోగేట్ బేబీ అంటూ కట్టబెట్టి లక్షల్లో డబ్బులు గుంజారు. ప్రస్తుతం సృష్టి ఆసుపత్రి డాక్టర్ నమ్రతతోసహా పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు... ఏపీ, తెలంగాణలోని సృష్టి సెంటర్లపై దాడులు నిర్వహిస్తున్నారు అధికారులు.






