- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంబటి వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ ఆగ్రహం
వ్యక్తిగత దూషణలకు పాల్పడటం ఏ పార్టీ నేతకైనా తగదని హితవు పలికారు. రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం తప్ప ఇలాంటి నీచమైన విమర్శలు కాదని ఆయన స్పష్టం చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (SatyaKumar Yadav) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంబటి రాంబాబు (Ambati Rambabu) వాడిన భాష అత్యంత దారుణంగా ఉందన్నారు. అది ఆయన సంస్కృతిని ప్రతిబింబిస్తోందని విమర్శించారు. వైసీపీ (YCP) నేతలు సమాజాన్ని ఎటు వైపు తీసుకెళ్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇలాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు ఎవరికైనా ఆగ్రహాన్ని తెప్పిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత దూషణలకు పాల్పడటం ఏ పార్టీ నేతకైనా తగదని హితవు పలికారు. రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం తప్ప ఇలాంటి నీచమైన విమర్శలు కాదని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా వ్యక్తిగత దూషణలు చేసినప్పుడు అవతలి వైపు నుంచి రియాక్షన్ రావడం సహజమేనని పేర్కొన్నారు. అయితే అంబటి వంటి వ్యక్తుల తీరు వల్ల రాజకీయ వ్యవస్థే కలుషితం అవుతోందని మంత్రి ధ్వజమెత్తారు.
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఓటమిని అంగీకరించలేక ఫ్రస్ట్రేషన్‌లో ఇష్టానుసారం మాట్లాడటం సరికాదని సత్యకుమార్ సూచించారు. కేవలం ఓడిపోయామన్న కోపంతో నోటికి వచ్చినట్లు మాట్లాడటం అంబటి రాంబాబు క్యారెక్టర్‌ను సూచిస్తోందని పేర్కొన్నారు. ఆయన మాటలతో వైసీపీ పార్టీ అసలు సంస్కృతి, వారి మానసిక స్థితి ఏంటో ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యక్తులపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజమే అయినప్పటికీ, వ్యక్తిగత దూషణలకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని మంత్రి సత్యకుమార్ యాదవ్ అభిప్రాయపడ్డారు.






