మెడికల్ కాలేజీల వ్యవహారంపై రాద్ధాంతం.. మంత్రి సత్యకుమార్ ఆగ్రహం

by Vemula.Srinu Prasad |

మెడికల్ కాలేజీల వ్యవహారంపై మాజీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి సత్యకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు...

మెడికల్ కాలేజీల వ్యవహారంపై రాద్ధాంతం.. మంత్రి సత్యకుమార్ ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: మెడికల్ కాలేజీల(Medical Colleges) వ్యవహారంపై మాజీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి సత్యకుమార్‌(Minister Satyakumar) ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను నిర్మించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ(Ycp) వ్యతిరేకిస్తూ ధర్నాలు, నిరసనలు, విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వైసీపీ విమర్శలకు మంత్రి సత్య కుమార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి జగన్‌ జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. కూటమిని విడగొట్టి రాజకీయపబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కూటమిని విడగొట్టడం వైసీపీకి ఈ జన్మలో జరగని పని అని హెచ్చరించారు. జగన్‌ డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జగన్‌ పాలనలో అవినీతి, భూ ఆక్రమణలు, నకిలీ మద్యం దందా కేసుల్లో వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా జైలుకు వెళ్తున్నారని మంత్రి సత్యకుమార్‌ తెలిపారు.

Next Story