- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలకృష్ణ తాగి వచ్చింది జగన్ చూశారా?.. మంత్రి కౌంటర్
ఇటీవల ఏపీ అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ఏపీ అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. మాజీ సీఎం జగన్‌ను సైకో అని మాట్లాడటం హాట్ టాపిక్‌గా మారింది. బాలకృష్ణ వ్యాఖ్యలపై నిన్న జగన్(YS Jagan) స్పందించారు. మద్యం తాగి అసెంబ్లీకి వచ్చిన వాళ్లను అసెంబ్లీలోకి ఎలా అనుమతించారని జగన్ ప్రశ్నించారు. అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి? ఆయన మాట్లాడింది ఏంటని జగన్ ఫైర్ అయ్యారు. నందమూరి బాలకృష్ణ తాగొచ్చి అసెంబ్లీలో ఇష్టానుసారంగా మాట్లాడారని అన్నారు. ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందనన్నారు. తాగిన వాళ్లను స్పీకర్ ఎలా అసెంబ్లీలోకి అనుమతించారని జగన్ నిలదీశారు. అయితే తాజాగా జగన్ వ్యాఖ్యలకు మంత్రి సత్యకుమార్(Satya Kumar) కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీకి రావడానికే భయపడుతున్న జగన్.. బాలకృష్ణ గురించి మాట్లాడటం హాస్యాస్పందంగా ఉందని విమర్శించారు. అసెంబ్లీకి రాకుండా బాలకృష్ణ తాగొచ్చారని జగన్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. బాలకృష్ణ తాగి వచ్చింది జగన్ కళ్లారా చూశారా? అని అడిగారు. ఆ మాట నేరుగా బాలకృష్ణనే అడగాలి కదా అని సత్యకుమార్ హితవు పలికారు.






