అమరావతిని స్మశానంగా మార్చాలని చూశారు: మంత్రి సత్యకుమార్

by Ajay Maddhiboyina |

గ‌త ప్ర‌భుత్వం అమ‌రావ‌తిని స్మశానం అని చెబుతూ దానిని నిర్వీర్యం చేశార‌ని మంత్రి స‌త్య‌కుమార్ అన్నారు.

అమరావతిని స్మశానంగా మార్చాలని చూశారు: మంత్రి సత్యకుమార్
X

దిశ‌, వెబ్ డెస్క్: గ‌త ప్ర‌భుత్వం అమ‌రావ‌తిని స్మశానం అని చెబుతూ దానిని నిర్వీర్యం చేశార‌ని మంత్రి స‌త్య‌కుమార్ అన్నారు. అమ‌రావ‌తిని పూర్తిగా స్మశానంగా మార్చే ప్ర‌య‌త్నం చేశార‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. కూటమి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర‌వాత ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా అద్భుతంగా నిర్మాణం జ‌రుగుతోంద‌ని చెప్పారు. దానికి అనుగుణంగా కేంద్రం కూడా నిధులు ఇచ్చి రాజ‌ధాని అభివృద్ధికి స‌హ‌క‌రిస్తోంద‌ని అన్నారు.

గ‌తంలో కూడా కేంద్రం నిధులు ఇచ్చింది కానీ ప‌ట్టించుకోలేద‌ని అన్నారు. జీవ‌నాడి అయిన పోలవరాన్ని నిర్ల‌క్ష్యం చేశార‌ని మండిప‌డ్డారు. పోల‌వరాన్ని పూర్తిగా విస్మ‌రించారని అన్నారు. గ‌తంలో పోల‌వ‌రంపై స‌మీక్ష‌లు నిర్వ‌హించిన దాఖ‌లాలు కూడా లేవ‌ని అన్నారు. 2 ల‌క్ష‌ల 10వేల కోట్ల‌తో రాష్ట్రంలో మోడీ అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న చేశార‌ని చెప్పారు. నేడు సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ నిరంత‌రం స‌మీక్ష‌లు చేస్తూ ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తున్నార‌ని అన్నారు.

Next Story