అది హంతకుల ఫ్యాక్టరీ.. వైసీపీపై మంత్రి సవిత తీవ్ర విమర్శలు

by Vemula.Srinu Prasad |

సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ఉత్తమ నాయకులను, కార్యకర్తలను తయారు చేస్తుంటే, వైసీపీ హంతకుల ఫ్యాక్టరీగా మారిందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తీవ్రంగా విమర్శించారు..

అది హంతకుల ఫ్యాక్టరీ.. వైసీపీపై మంత్రి సవిత తీవ్ర విమర్శలు
X

దిశ, ఏపీ బ్యూరో: సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ఉత్తమ నాయకులను, కార్యకర్తలను తయారు చేస్తుంటే, వైసీపీ హంతకుల ఫ్యాక్టరీగా మారిందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తీవ్రంగా విమర్శించారు. జగన్‌కు ఆది నుంచి శవ రాజకీయాలు చేయడం అలవాటుగా మారిందన్నారు. తండ్రి శవంతో కొద్ది కాలం, బాబాయ్ గొడ్డలిపోటుతో మరికొన్ని రోజులు శవ రాజకీయాలు చేశారన్నారు. దళిత బిడ్డ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును నెత్తినపెట్టుకుని రాజకీయాలు చేస్తున్న జగన్ ది సైకోయిజమని మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలో విలేకరులతో మంత్రి సవిత మాట్లాడారు. హత్యలు చేయడం, సాక్షులను లోబరుచుకోవడం, వినకుంటే వారి కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరించడం వైసీపీ నాయకులకు అలవాటుగా మారిందన్నారు. చివరికి సహకరించిన పోలీసులను, అధికారులను సైతం బెదిరించడానికి వెనుకాడడం లేదన్నారు. నేడు ఎమ్మెల్సీ అనంతబాబు కూడా అదే రీతిలో సాక్షులను బెదిరించాడన్నారు. కూటమి ప్రభుత్వంలో పోలీసులు చట్ట ప్రకారం పనిచేస్తున్నారని, హంతుకులను, రౌడీలను విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సాక్షులు ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, వారికి పోలీసులు, ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సవిత భరోసా ఇచ్చారు.

జగన్ ది సైకోయిజం.....

స్వర్ణాంధ్ర ప్రదేశ్ రూపకల్పనకు సీఎం చంద్రబాబు రేయింబవళ్లు కష్టపడుతుంటే, వైసీపీ నాయకులు రప్పా రప్పా అంటూ హత్యలకు, దౌర్జన్యాలకు పాల్పడడం క్షమించరాని నేరమని మంత్రి సవిత మండిపడ్డారు. జగన్ రెడ్డి అధికార దాహానికి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు బలైపోతున్నారన్నారు. పెద్దదస్తగిరి, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అమర్నాథ్ గౌడ్, సింగయ్యలాంటి వారందరూ అణగారిన వర్గాలకు చెందిన వారే వైసీపీ అకృత్యాలకు బలైపోయారన్నారు. వైసీపీ కార్యకర్తలు ఆలోచించుకోవాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. టీడీపీ నాయకులు గాని, కార్యకర్తలు గాని రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, జగన్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడని, వైసీపీ కార్యకర్తలు గమనించాలని సూచించారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ఉత్తమ నాయకులను, కార్యకర్తలను తయారు చేస్తుంటే, వైసీపీ హంతకుల ఫ్యాక్టరీగా మారిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. దళిత బిడ్డ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును నెత్తినపెట్టుకుని రాజకీయాలు చేస్తున్న జగన్ ది సైకోయిజమని మంత్రి సవిత మండిపడ్డారు.

జగన్ ఎందుకు పరామర్శించలేదు..?

పెద్ద దస్తగిరి కుటుంబాన్ని కడపలో పర్యటిస్తున్న జగన్ రెడ్డి ఎందుకు పరామర్శించలేదని మంత్రి సవిత ప్రశ్నించారు. శవ రాజకీయాలు జగన్ కు అలవాటేనని, కాని, బీసీ సామాజిక వర్గానికి చెందిన పెద్ద దస్తగిరి కుటుంబాన్ని మాత్రం ఓదార్చలేదని అన్నారు. పెద్ద దస్తగిరి భార్యకు సమాధానం చెప్పే ధైర్యం లేకే జగన్ ముఖం చాటేశారని మండిపడ్డారు. ‘నీ కోసం నా భర్త చేయరాని పనులన్నీ చేస్తే... నా పసుపు కుంకుమలను చెరిపేస్తావా..?’ అని పెద్ద దస్తగిరి భార్య రవణమ్మ అడిగే ప్రశ్నకు జగన్ వద్ద సమాధానం లేదన్నారు. అందుకే, ఆయన పెద్ద దస్తగిరి కుటుంబాన్ని పరామర్శించలేదని మంత్రి సవిత తెలిపారు.

Next Story