Minister Ravindra: అధికార గర్వంతో ఆనాడు పిచ్చికూతలు కూశారు.. మంత్రి కొల్లు రవీంద్ర ఘాటు వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

అధికార గర్వంతో వైసీపీ నాయకులు (YCP Leaders) సోషల్ మీడియా (Social Media) వేదికగా తమను టార్గెట్‌గా చేసుకుని ఆనాడు అసభ్యకర పోస్టులు పెట్టారని మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Minister Ravindra: అధికార గర్వంతో ఆనాడు పిచ్చికూతలు కూశారు.. మంత్రి కొల్లు రవీంద్ర ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: అధికార గర్వంతో వైసీపీ నాయకులు (YCP Leaders) సోషల్ మీడియా (Social Media) వేదికగా తమను టార్గెట్‌గా చేసుకుని ఆనాడు అసభ్యకర పోస్టులు పెట్టారని మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ (YCP) ప్రజలను కష్టాలు పాలు చేసిందని ఫైర్ అయ్యారు. కనీస జ్ఞానం లేకుండా ఆ పార్టీ లీడర్లు మహిళలని కూడా చూడకుండా నోటితో చెప్పలేని పదజాలంతో బూతులు తిట్టారని గుర్తు చేశారు.

గట్టిగా ప్రశ్నిస్తే.. తిరిగి బాధితులపైనే కేసులు పెట్టిన ఘటనలు కోకొల్లలు ఉన్నాయని తెలిపారు. బందరు ప్రాంతంలో కూడా ఓ వెధవ, సన్నాసి ఉన్నారని.. అప్పట్లో తనను బూతులు తిట్టి, అక్రమంగా కేసులు బనాయించి జైలు పాలు చేశారని ధ్వజమెత్తారు. నేడు మళ్లీ సిగ్గు లేకుండా ప్రెస్ ముందుకు వచ్చి స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని ఆక్షేపించారు. నాడు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిలో.. నేడు అరెస్ట్ భయం మొదలైందని అన్నారు. ఈ వ్యవహారంలో ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి రవీంద్ర (Minister Kollu Ravindra) వార్నింగ్ ఇచ్చారు.

Next Story